Current Date: 19 Jun, 2026

అనకాపల్లి జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులను వెంటనే బస్సులోనుంచి బయటకు దింపడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.